అద్దె దుకాణాల వద్ద ప్రయివేట్ వాహనాలతో పాటు ఉపాద్యాయుల వాహనాలు గేటు వద్దే పార్కింగ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాయంత్రం సెలవు అయ్యే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 1350 మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలకు ఒకే ద్వారం ఉంది.
ఒక పక్క రెండు వైపులా ఉన్న పాఠశాల మడిగెలు వ్యాపారానికి అద్దెకివ్వడం , వ్యాపారస్తులు రోడ్డు దాకా షెడ్డు ఏర్పటు చేసుకున్నారు. దింతో గేటు చిన్నదై పోయింది … పైగా ఉపాధ్యాయులు విద్యార్థుల కంటే ముందే ఇంటికి వెళ్లాలనే ఆతృతలో విద్యార్థులు అందరూ పాఠశాల నుండి బయటకు వెల్లకముందే తమ వాహనాలను స్కూల్ గేటు కి అడ్డంగా పెట్టి ఎప్పుడు వెళ్లిపోవాలనట్లు వ్యవహరిస్తున్నారు. స్కూల్ నుండి పిల్లలు అందరూ వెళ్ళారా లేదా అనేది చూడకుండా ఉపాధ్యాయులు వాహనాలు అడ్డంగా పెట్టి ఇలా వ్యవహరిస్తుండటంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పై ఫొటోలు చూడండి ఒక పక్క విద్యార్థులు గేటు దాటుతున్న వేళ్ళ ఇరుకుగా ఉన్న ప్రదేశంలో ఉపాధ్యాయులు కూడా తమ వాహనాల్లో కూర్చోడానికి ప్రయత్నిస్తున్న చూడవచ్చు.