రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ జిల్లా :
లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్వత్రంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రాథోడ్ ప్రచారంలో వేగం పెంచారు. గురువారం ఇచ్చోడా మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

గెర్జామ్ గ్రామంలో ఆదివాసీ నాయకుల మద్దత్తు లభించడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ గా ఉన్నప్పుడే ప్రతీ రైతులు వేసిన రోడ్ల ద్వారా ఎంతో లాభం జరుగుతుందని వారు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చే వేల కోట్ల గిరిజన ఫండ్ ను పోరాడి తీసుకొస్తానని సుభాష్ రాథోడ్ అన్నారు.
గతంలో పార్టీల టికెట్ మీద లంబాడి, ఆదివాసీ నాయకులు గెలిచినా అభివృద్ధి శూన్యమని అన్నారు. ఇప్పటికి ఆదివాసీ గూడాలకు, లంబాడి తాండలకు రోడ్డు సౌకర్యాలు లేవని అన్నారు. రోడ్డు సౌకర్యం లేక వాగు దాటి రావడానికి గంటల తరబడి శ్రమించి గర్భిణీ ని ప్రసవం కోసం ఆదివాసీ మహిళను రోడ్డు పై తీసుకోచ్చే దాకా ఆమె రోడ్డు పైనే ప్రసవించిందని గుర్తు చేశారు. రెండు తీగల నాయకులు గెలిచినా ఎక్కడ సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. అందుకే ఈ సారి మార్పు తీసుకరావాలని అన్నారు.
గెలిచినా ఒక సంవత్సరంలోనే ప్రతీ గ్రామానికి పక్క రోడ్డు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ ఉన్నప్పుడే గ్రామపంచాయతీలో రైతుల కోసం వ్యవసాయ క్షేత్రాలకు రోడ్డు సౌకర్యం కల్పించానని, ఎంపీ గా గెలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి అభివృద్ధి పనులు తీసుకొస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పటేల్లు మరియు తదితరులు పాల్గొన్నారు.