Thursday, April 3, 2025
Homeతెలంగాణఆదిలాబాద్ఇండిపెండెంట్ అభ్యర్థి సుభాష్ రాథోడ్ గెలుపు సునాయాసమే ...

ఇండిపెండెంట్ అభ్యర్థి సుభాష్ రాథోడ్ గెలుపు సునాయాసమే …

ముందు నుండి మేము మార్పు కోరుతున్నాం అంటున్న ప్రజలు

గతంలో గెలిచిన ఏమి చేయనోళ్ళు మళ్ళీ గెలిస్తే ఎం చేస్తారని ప్రశ్నిస్తున్న జనం

ప్రచారానికి వెళుతున్న కొన్ని పార్టీల నాయకులను ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్న జనం

*రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :

స్వతంత్ర అభ్యర్థి సుభాష్ రాథోడ్ ప్రచారంలో వేగం పెంచారు. శనివారం రోజు బోథ్ మండలంలో ప్రచారం నిర్వహించారు. ముందుగా కైలాస్ టెక్డి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం బోథ్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అయితే ప్రజల స్పందన చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముందు నుండి ప్రజలే ఈ సారి మార్పు తప్పదు అని పేర్కొనడం .. కాంగ్రెస్ పార్టీకి , బీజేపీ పార్టీ అభ్యర్థికి , బి ఆర్ ఎస్ పార్టీకి ఎన్ని సార్లు అవకాశం ఇచ్చిన అభివృద్ధి జరగలేదని గ్రామస్తులు తెలపడం చూస్తుంటే ప్రజలు ఈ సారి అభివృద్ధి కోసమే ఓటు వేసే ఆలోచనతో ధృడ నిశ్చయంతో ఉన్నారని అన్నారు. ఇన్నెండ్లు వారికి అవకాశం ఇచ్చారు. పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్క అవకాశం ఇవ్వండనీ ప్రజల్ని కోరారు.

తన లాంటి యువతకు అవకాశం ఇస్తే అభివృద్ధి కోసం పని చేసి భవిష్యత్ లో ఓటు అడగకుండానే ప్రజలు ఓటు వేసేలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అన్నారు. బీజేపీ అభ్యర్థి నగేష్  కుటుంబానికి 45 ఏళ్లకు పైగా , కాంగ్రెస్ పార్టీకి దేశం రాష్ట్రంలో 75 ఏళ్లకు పైగా అవకాశం ఇచ్చినామని ఎం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. పార్టీల తరుపున ప్రచారానికి వెళుతున్న నాయకులను కూడా ప్రజలు నిలదీయడం చూస్తుంటే ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చిందని అందుకే ఈ సారి తనకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఇప్పుడు వందల సంఖ్యలో పార్టీల తరుపున గుంపులుగా తిరిగే నాయకులు ఎన్నికల తరువాత అయిదు సంవత్సరాలు కంటికి కూడా కనిపించకుండా మళ్ళీ ఎన్నికలు అచ్చే వరకు కనిపియరని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  యువత పార్టీల  సెంటిమెంటుతో ఒత్తిడిలో ఓటు వేసి ఐదేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే తన లాంటి వారికి అవకాశం ఇవ్వాలని అన్నారు. ధర్మ రక్షణ తో పాటు అన్ని ధర్మాల ప్రజలు భారతీయులే కాబట్టి వారి అభివృద్ధి కోసం పని చేస్తానని అన్నారు. మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో రాగానే వారి గురించి ఏనాడూ పట్టించుకోరని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లకు పైగా అవుతున్న రోడ్లు లేని గ్రామాలు , డ్రైనేజీ ఊర్లు,  మరుగుదొడ్లకు నిధులు వచ్చిన ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారుల పై చర్యలు తీసుకునేలా చేస్తానని అన్నారు. గెలిచిన మొదటి సంవత్సరంలో 10 వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపి ఉండి మోడీ నుండి 10 వేల కోట్లు తీసుకొచ్చారని అన్నారు.  అభివృద్ధి  చేయాలంటే ముందుగా కావాల్సిన నిధులు తీసుకురావాలి, అలా చేయాలంటే ముందుగా ప్రణాళిక మరియు ఎస్టిమేట్ తయారు చేసి ఎంత వరకు నిధులు అవసరం ఉంటుందో కేంద్రానికి తెలియజేస్తే వారు నిధులు మంజూరు చేస్తారని , గతంలో అలా చేయకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు నష్టపోయారని అన్నారు. అభివృద్ధి చేయడం తన బాధ్యత అని ఒక సారి గెలిపించి ఆశీర్వదించండని అన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్  గాయక్వాడ్,ఎల్  శేష్ రావ్ , లాటే దత్త , సాయి కుమార్ , బి గోవింద్ మరియు వివిధ గ్రామాల ప్రజలు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?