Saturday, April 12, 2025
Homeతెలంగాణఅసిఫాబాద్ కొమురం భీంగుడి , బడి , వైద్యం , రోడ్ల కోసం సిలిండర్ గుర్తుకు ఓటు వేయండి

గుడి , బడి , వైద్యం , రోడ్ల కోసం సిలిండర్ గుర్తుకు ఓటు వేయండి

మైనార్టీ సోదరుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అమలు చేస్తా…

కాషాయవాది మీ రాథోడ్ సుభాష్ కు ఒక్క అవకాశం ఇవ్వండి…

బీజేపీ పార్టీ కోసం చేసిన సేవలు గుర్తించి ఓటు వేయండి…

రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ :

గుడి , బడి , వైద్యం కోసం సిలిండర్ ( GAS CYLINDER SYMBOL) గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి మాజీ సర్పంచ్ రాథోడ్ సుభాష్ ( RATHOD SUBASH INDEPENDENT MP CANDIDATE ADILABAD PARLIAMENT) అన్నారు. గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో మాట్లాడుతూ….
కొంతమంది పది పార్టీలు తిరిగేది కేవలం తమ స్వార్థం కోసమే అని అన్నారు. వారికి మీ గుడి , బడి , వైద్యంతో అవసరం ఉండదని అన్నారు. ఎన్నికల్లో గుంపుగా తిరిగే వారి అనుచరులు కూడా ఎన్నికల ఫలితం తరువాత ఎక్కడుంటారో కూడా తెలియదని అన్నారు.

సిలిండర్ గుర్తు స్వతంత్ర ఎంపి అభ్యర్థి రాథోడ్ సుభాష్ ప్రచార కార్యక్రమంలోనీ ఫోటోలు

గోడం నగేష్ కు ఎన్నో అవకాశాలు ఇచ్చినామని కనీసం ఆదివాసీ గ్రామాలకు రోడ్లు కూడా వేయలేదని అన్నారు. ఉమ్మ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బోథ్ గతంలో గోడం నగేష్ ఎంపీగా ఉన్నపుడు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు ఏమిటో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు.

కట్టర్ బీజేపీ కార్యకర్త అయిన తనను ( రాథోడ్ సుభాష్ ) ను బీజేపీ కార్యకర్తలు ఆదరిస్తున్నారని అన్నారు. పార్టీ కోసం కష్టపడి న వారినే కార్యకర్తలు గుర్తిస్తారని అన్నారు. గతంలో ధర్మం కోసం పోరాడి కేసులు కూడా ఎదుర్కొన్నట్లు తెలిపారు.
మోడీ గారి ప్రస్తుత వాతావరణం చూసి స్వార్థం తో గెలిచి హాయిగా ఉండాలని వచ్చారని.. అంతేగాని ధర్మ రక్షణ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయరని అన్నారు.

కాషాయ వాడి మీ రాథోడ్ సుభాష్ ను ఓటు తో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బి గోవింద్ , తరుణ్ , బాల కుంబేవాద్ , గోరక్ నాథ్ , సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అన్న కోసం తమ్ముడి ప్రచారం…

స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ సుభాష్ ను సిలిండర్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తమ్ముడు రాథోడ్ సంజీవ్ కుమార్ అన్నారు. భీం పూర్ , నార్నూర్, గంగాపూర్ , ఉమ్రి, ఇంద్రవెళ్లి అనేక గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సుభాష్ రాథోడ్ సుభాష్ సర్పంచ్ గా ఉన్న సమయంలో రైతుల పొలాలకు రోడ్డు సౌకర్యం కల్పించారని అన్నారు.

సర్పంచ్ ఉన్నపుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఎంపీ గా గెలిపిస్తే గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని అన్నారు. ప్రచారం లో ఎన్నో గ్రామాలు ఇప్పటికి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉన్నాయని అన్నారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చామని కానీ అభివృద్ధి జరగలేదని అన్నారు. సర్పంచ్ ఉన్నపుడే గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం ఢిల్లీ దాకా వెళ్లారని అన్నారు. అదే ఎంపీగా గెలిపిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సమస్యశ్యామలం చేస్తారని ఓటు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ , రూప్ సింగ్ రాథోడ్ , గణేష్ తదితరులు పాల్గొన్నారు.

*అద్దంకి దయాకర్ జరిగిపోయిన కేసు*

అద్దంకి దయాకర్ హిందువుల మనో భావాలు దెబ్బతినెలా మాట్లాడం కరెక్ట్ కాదు అని అన్నారు. రాజకీయం లో ఇతరుల దేవుళ్లను అవమానించే అధికారం నీకు ఎవరిచ్చారు అని అన్నారు. అద్దంకి ఇలాగే  మాట్లాడితే  ప్రజలు వీపు పచ్చడి చేసి పిర్రెలు సింత పండు చేస్తారని అన్నారు. నీకు రాజకీయ నాయకులతో విభేధాలు ఉండవచ్చు అంతే గాని ఇలా ఒక వర్గం ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అన్నారు. అద్దంకి దయాకర్ మాటలు వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఎంపీగా గెలిచి  హిందువుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని అన్నారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?