విదేశీ గడ్డపై భారత దేశం అంటే తెలియచేసి నిద్రావస్థలో ఉన్న భారత జాతిని నిద్రలేపి దేశభక్తి, మాతృ భక్తి ని ప్రతీ భారతీయుడి గుండెల నిండా నింపిన విశ్వ విజేత వివేకానందుడు.
ఈరోజు ఆయన 160 వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుందాం.
వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు వివేకానంద. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. రాజయోగ, కర్మయోగ, భక్తియోగ , జ్ఞానయోగ వంటి సాహిత్య రచనలు చేశారు.
మొదట వివేకానందుడి పేరు చెప్పగానే మనందరికీ గుర్తుకు వచ్చేది అమెరికా లోని చికాగో నగరంలో 130 సంవత్సారాలు క్రితం జరిగిన సర్వమత మహా సభ. నాడు ఆంగ్లంలో ఆయన ప్రసంగిస్తూ అమెరికా దేశపు సోదర సోదరీ మనులార అని ప్రసంగం మొదలు పెట్టగానే ముగ్ధులైన సభికులు మూడు నిమిషాల సేపు చప్పట్లతో మారు మ్రోగించరు. ఆయన చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నీరాజనాలు పలికారు. నాటినుండి వివేకానంద ను లైట్నింగ్ ఆరేటర్ అని పిలిచేవారు.
స్వామి వివేకానంద 1863 జనవరి 12 వ తేదీన కలకత్తా లో విశ్వనాథ దత్త, బువనేశ్వరి దేవిలకు జన్మించాడు. వారు నరేంద్రుడు అని పేరు పెట్టి ముద్దుగా నరేన్ అని పిలిచేవారు. చిన్నప్పటి నుండే స్వామి వివేకానంద అల్లరి చేస్తూ ఉంటూనే గంటల కొద్దీ ధ్యానం లో నిమగ్నం అయ్యే వారు. దైర్య సాహసాలు, అద్భుతమైన తెలివితేటలు బాల్యం నుండే ఆయన సొంతం. నరేంద్రుడు అనేక ఉపన్యాసాలతో యువతకు దైర్యం నూరి పోసేవారు. రామ కృష్ణ పరమ హంస తో పరిచయం ఏర్పడి ఆయనకు ప్రియ శిష్యుడు అయ్యాడు వివేకానంద. రామ కృష్ణ పరమహంస కోరిక మేరకు అమెరికా వెళ్లిన వివేకానంద అక్కడి నుండి వివిధ పచ్యత్య దేశాల్లో తిరిగి భారత దేశ సంస్కృతిని, హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. భారత దేశ ప్రాచీన ఔన్యత్వన్ని తిరిగి పొంది, భారత దేశం ఓ ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచానికి జ్ఞానాన్ని పంచాలనేది ఆయన కళ. వివిధ దేశాలలో తిరిగి 1896 లో భారత దేశానికి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. ఈ మఠం ద్వారా దేశ యువతకు దిశా నిర్దేశం చేశాడు. స్వామి వివేకానంద 39 ఏళ్ల వయసులో 1902 జూలై 4 వ తేదీన పరమావిదించారు. ఆయనకు గుర్తుగా భారత ప్రభుత్వం వివేకానంద జన్మదినాన్ని 1984 లో జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించారు.
స్వామీ వివేకానంద ప్రభవంతం చూపిన కొన్ని సూక్తులు
1.బలమే జీవనం - బలహీనతే మరణం
2.లేవండి మేల్కొండి, గమ్యం చేరే వరకు విశ్రమించ కండి.
3.ప్రయత్నం చేసి ఒడిపో కానీ ప్రయత్నం చేయకుండా ఒడిపోకు.
4.కెరటన్ని ఆదర్శంగా తీసుకోండి లేచి పడుతున్నందుకు కాదు పడినా పైకి లేస్తున్నoదుకు.
- నీ వెనకాల ఏముంది, నీ ముందు ఏముంది అనేది ముఖ్యం కాదు నీలో ఏముందనేది ముఖ్యం.
6.మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా ఉండేందుకు ప్రయత్నించు. - ప్రతీ రోజు మితో మీరు ఒక్క సారైనా మాట్లాడుకొండి లేదంటే ఓ అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.
- జీవితంలో ధనం కోల్పోతే తిరిగి సంపాదన చేయొచ్చు కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే.
9.మతం అనేది సిద్ధాంత రాద్దాంతాలలో లేదు. అది ఆచరణలో, ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది. - ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే
ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ సహనం తో ఉండండి. - ప్రతీ మనిషిలో మంచి చూడటం నేర్చుకుంటే మనలో మాలిన్యాలు దూరమై మంచి పెరుగుతుంది.
ఇలా ఎన్నో సూక్తులు, బోధనలు, ప్రసంగాలు చేసి యువతను మేల్కొలిపి కార్యసాధకులుగా మార్చారు.
దేశ ప్రజలందరికి ఆత్మవిశ్వాసం క్రియా శూరత్వము కావాలి. ఈ అవసరము నాకు స్పష్టంగా కనిపిస్తుంది అని నొక్కి చెప్పారు స్వామి వివేకానంద. అంతేకాక మనం సోమరులము, ఏ పని చేయలేము ముందు మనమంతా సోమరితనాన్ని వదిలి కష్టించి పని చేయటం అలవర్చుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది అంటూ యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద.
- వ్యాసకర్త
- గాజుల రాకేష్
9951439589