హైదరాబాద్ :
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కెసిఆర్.. విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించకపోవ డంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయా యని,విమర్శించారు.
మంగళవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో కాదు.. వారం రోజుల్లోనే అమలు చేసేవాళ్లమని.. కేసీఆర్, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం వల్ల కొంత సమయం తీసుకున్నా మని తెలిపారు.
ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని.. వచ్చే నెల ఫిబ్రవరి నుంచి ఉచిత కరెంట్ ను అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
200 యూనిట్ల వరకు ప్రజలందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తామని తెలిపారు. దాంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్లను కూడా ఇవ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు..
ఫిబ్రవరి నుంచి తెలంగాణలో ఫ్రీ కరెంటు
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on