Monday, April 7, 2025
Homeతెలంగాణవచ్చే పంట సీజన్‌ నుంచి సన్న వడ్లను రూ.500 బోనస్‌..!

వచ్చే పంట సీజన్‌ నుంచి సన్న వడ్లను రూ.500 బోనస్‌..!

హైదరాబాద్‌: వచ్చే పంట సీజన్‌ నుంచి సన్న వడ్లను రూ.500 బోనస్‌ ఇచ్చి కొంటే.. ఒక్కో సీజన్‌కు రూ.2 వేల కోట్ల వరకూ ప్రభుత్వంపై భారం పడనుందని రాష్ట్ర మంత్రిమండలి అంచనా వేసింది. రేషన్‌ కార్డులు, హాస్టళ్లు, ఇతర అవసరాలకు ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారని, ఇకనుంచి సన్న బియ్యమే ఇవ్వాలని నిర్ణయించింది. పలు జిల్లాల్లో ఇప్పటికే 50 శాతానికి పైగా ధాన్యం కొనుగోలు జరిగిందని మంత్రిమండలికి అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న     వానాకాలం సీజన్‌లో సాగుచేసే పంటలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి వ్యవసాయశాఖకు పలు సూచనలు చేసింది.   కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీల ప్రస్తుత పరిస్థితి, మరమ్మతులు చేస్తే నీటి ఎత్తిపోతలకు అవకాశాలపై సాగునీటి  పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజంటేషన్‌ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీపై విచారణ జరిపిన ‘జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ’ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదికపై మంత్రివర్గం చర్చించింది. మరమ్మతుల అనంతరం నీటి ఎత్తిపోతలకు అవకాశం ఉంటుందా అన్నది పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మేడిగడ్డ కాకుండా మిగిలిన రెండు బ్యారేజీల నుంచి నీటి ఎత్తిపోతలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. అంతకుముందు సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక అధికారి ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మంత్రివర్గానికి వివరించారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?