◾️ ఉద్యోగంతో పాటు పిల్లల భవిష్యత్తుపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి : జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా నందు గల పోలీస్ ఐటీ కోర్ ఇన్చార్జ్ షేక్ మురాద్ అలీ కూతురు సానియా నాజ్ ఈ సంవత్సరం నీట్ ఎంట్రన్స్ లో భాగంగా ఎంబిబిఎస్ సీటు సాధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్పీ క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ప్రస్తుతం వెలువడిన నీట్ ఫలితాలలో మంచి మార్కులు సంపాదించి సిద్దిపేట్ ఆర్వీఎం కాలేజ్ నందు ఎంబిబిఎస్ సీటు సంపాదించినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులందరూ తమ వృత్తిని ఎంత శ్రద్ధగా నిర్వహిస్తారో అంతే శ్రద్ధగా పిల్లల భవిష్యత్తు విద్యపై దృష్టి సారించాలని సూచించారు. పోలీసులుగా పండగల నందు, అన్ని కఠినమైన పరిస్థితుల నందు,ఎన్నో రకాల విధులు నిర్వర్తించినప్పటికీ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి తమ సాయశక్తుల కృషి చేయాలని తెలిపారు. అలాగే సీటు సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమార్తెకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇలాగే మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు వ్యవస్థ ను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రయత్నించాలని హితువు పలికారు.