సాధారణంగా ఒక్కో మతంలో అనేక రకాల సంప్రదాయాలను పాటిస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. అయితే హిందువులు స్నానం చేయకుండా గుడికి వెళ్తే పాపం చుట్టుకుంటుందని అని నమ్ముతుంటారు.
అలాగే కొందరు స్నానం చేయకుండా మరేది చేయరు. అలా చేస్తే అశుభం అని నమ్మకంతో ఉంటారు. అయితే జైనమతంలోని బుషులు, సాధువులు కఠిన జీవితాన్ని గడుపుతారట. వారు దీక్ష తీసుకున్న తర్వాత జీవితాంతం స్నానం చేయకుండా ఉంటారట. అయితే జైనమతంలోనూ రెండు రకాల వారు ఉంటారని సమాచారం. అందులో ఒకటి శ్వేతాంబర, దిగంబర వంటి శాఖల వారు ఉంటారట.
ఇందులో శ్వేతాంబర వారు శరీరంపై దుస్తులు ధరిస్తారు. అలాగే దిగంబర వారు ఎలాంటి దుస్తులు ధరించకుండా ఉంటారట. కేవలం నిద్రపోయే సమయంలో పలుచని క్లాత్ ఉపయోగిస్తారని తెలుస్తోంది. అయితే జైన మతానికి సంబంధించిన సన్యాసులు జీవిత కాలం పాటు స్నానం చేయకుండా ఉంటారట. ఎందుకంటే అలా చేయడం వల్ల శరీరంలోకి క్రిములు పోయి అనారోగ్య సమస్యలు వస్తాయని వారి నమ్మకం. అలాగే నీటిలో నివసించే జీవులు నాశనం అవుతాయని నమకంతో ఉంటారు కాబట్టి ఈ వర్గానికి చెందిన సన్యాసులు స్నానం చేయకుండా ఉంటారని తెలుస్తోంది. దీంతో మహిళలు, పురుషులు కొన్ని రోజులకు ఒకసారి తడి గుడ్డతో శరీరాన్ని తుడుచుకుంటారట. అలాగే వీరు ఎలాంటి సమయంలోనైనా తెల్లటి దుస్తులు ధరించి మూతికి మాస్క్ పెట్టుకోకుండా ఉండరు.