రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చొడా : అభివృద్ధి చెందుతున్న ఇచ్చోడా పట్టణ మండల కేంద్రంలో రోజు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది.
రోడ్డు పెద్దదే అయిన వ్యాపారులు రోడ్డు హద్దులు దాటి తమ సరుకులు పెట్టుకోవడం , అదే విధంగా చిరు వ్యాపారులు కూరగాయలు , పండ్ల తోపుడు బండ్లను రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేసుకోవడం తో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
కొంతమంది వ్యాపారులు పెద్ద పెద్ద వాహనాలను సరుకులు దినంలో దించడానికి తమ దుకాణాల ముందు నిలుపుదల చేసి ట్రాఫిక్ కు కారణమవుతున్నారు. మరికొంతమంది రోడ్ల పై వాహనాలు పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆటోలు , బస్సులు న సైతం రోడ్ల పైనే నిలిపి ప్రయాణికుల తీసుకెళుతున్నారు.
సోమవారం అంగడి రోజు అయితే ట్రాఫిక్ హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ ను తలపిస్తుంది. సాధారణ రోజుల్లో సైతం ఓ రెండు నిమిషాలు అత్యవసర వాహనం నిలపడానికి కూడా స్థలం ఉండదు. రోడ్లు మధ్యలో నుండి రెండు వైపులా 70 – 70 ఫిట్లు రోడ్డు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.. ఎందుకంటే మనకు పట్టణం మధ్యలో ఓ 15 ఫీట్ల రోడ్డు మాత్రమే కనిపిస్తుంది. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Nice bai