మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్
ఉమెన్ పిఎస్ లో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు.*
వివరాలలో …..
ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్ కే కాలనీకి చెందిన శ్రీమతి జాస్మిన్ (28) అనే మహిళ 2017 సంవత్సరంలో అబ్దుల్ అతీక్ తో వివాహం జరిగింది. వీరి ఇరువురికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం కలరు. గత 2 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్యన మనస్పర్ధల కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. గత సంవత్సరం ఫిబ్రవరి నెల నందు భర్త అబ్దుల్ అతిక్ పై హరాస్మెంట్ కేసు కూడా నమోదు చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ డబ్ల్యూపీఎస్ తెలిపారు. ఈరోజు బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ నందు భర్త అబ్దుల్ అతీక్ పై త్రిపుల్ తలాక్ కేసు Sec 4 of THE MUSLIM WOMEN (PROTECTION OF RIGHTS ON MARRIAGE ) ACT , 2019 ప్రకారం నమోదు చేయడం జరిగిందని డబ్లు పీఎస్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు.