అయ్యావ్వలు, అత్తమామలు , భర్తలు కూడా కొత్త చీరలు కొనియన్ని రోజుల్లో కేసీఆర్ భర్తల కొత్త చీరలు కొనిస్తుండు…
రిపుబ్లిక్ హిందూస్థాన్ , జనగామ : బతుకమ్మ సంబరాలు ల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తెలంగాణ మహిళలను అవమాన పరిచేలా వ్యాఖ్యానించారు.
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రం లో ఏర్పటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కేసీఆర్ ను తెలంగాణ మహిళలందరికి భర్త గా అన్ని చేస్తున్నాడని అన్నారు. సభలో ఉన్న అందరూ రాజయ్యా మాటలు విని అవాక్కయ్యారు.
అయ్యావ్వలు ఇస్తాలేరు , అత్తమామలు ఇస్తాలేరు, మొగుళ్లు ఇస్తాలేరు…. కానీ ముఖ్యమంత్రి మొగుడుగా మారి అన్ని ఇస్తుండు అని నోరు జారిన మంత్రి ఏకంగా కేసీఆర్ మహిళకు భర్త అని అన్నారు. ఎవరు కూడా ఏమి కొనివ్వని పరిస్థితి లో కేసీఆర్ భర్తల అన్నీ తానై అన్నీ ఇస్తున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ప్రజాప్రతినిది ఇంత దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రాజయ్యను ట్రోల్ చేస్తున్నారు.