రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చొడ :
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను గుర్తించి, ఆ సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రాతినిధ్యాలు, పోరాటాలు చేసే అగ్రగామి సంఘం టిఎస్ యూటీఎఫ్ అని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాస్ మరియు వి అశోక్ లు అన్నారు. ఉపాధ్యాయులు అధికమొత్తంలో టిఎస్ యూటీఎఫ్ లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఇచ్చోడ మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులను ఉద్ధేశించి వారు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తిన మొట్టమొదటి సంఘం టిఎస్ యూటీఎఫ్. రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని మేనేజ్మెంట్లలోని ఉపాధ్యాయులు పలురకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను అవగాహన చేసుకోవడంలో వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపలేదు. ఉపాధ్యాయులకు 30% ఫిట్మెంట్ ఇచ్చినా 33 నెలల ఏరియర్స్ విషయం అగమ్యగోచరం. కెజిబివీ ఉద్యోగులకు ఇంకా పిఆర్సి ఉత్తర్వులే ఇవ్వలేదు. గత 6 సంవత్సరాలుగా పదోన్నతులు లేవు, 3 సంవత్సరాలుగా బదిలీలు జరగలేదు. ఇలా పలు సమస్యలతో ఉపాధ్యాయులు నైరాశ్యంలో ఉన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించే సంఘం TSUTF లో సభ్యులుగా చేరడం ద్వారా ఉద్యమాలు బలోపేతం అవుతాయని అన్నారు…
ఈ కార్యక్రమంలో టిఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి యం.శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు…