రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంటర్నెట్ డెస్క్ : కామాంధులకు వావివరసలు కూడా తెలియడం లేదా…! నిత్యం ఏదొక చోట తండ్రి కూతురి పై అత్యాచారం చేసిన సంఘటనలు , ఉపాధ్యాయులు విద్యార్థుల పై ఏ రంగం , ఏ చోట చూసిన మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అర్థరాత్రి మహిళ తిరిగినప్పుడే అసలైన స్వాతంత్ర్యం అన్నది నిజమే కాబోలు…. కానీ నేడు పరిస్థితి దానికి కంటే దారుణంగా తయారైంది. అసలు పగలే మహిళల కు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ పడితే అక్కడ మహిళ విషయంలో నీచంగా ప్రవర్తిస్తున్నారు. వివాహితలు కట్నం వేధింపులతో ఇబ్బందులు పడుతున్న ఘటనలు చాలానే చూశాం. తాజాగా, ఓ మహిళ తన అత్తాంరింట్లో మామ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో ఓ మహిళకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె తన అత్తారింట్లో ఉంటోంది. అయితే ఆ మహిళపై కొద్దిరోజులుగా అత్తమామలు, మరిది కలిసి ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆమెపై భర్త తండ్రి కన్నేశాడు. తన భర్త డ్యూటికి వెళ్లిన సమయంలో అతడి తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అది భరించలేని వివాహిత భర్తకు చెప్పినా అతడు నమ్మలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించింది. సాక్ష్యాలు లేవపోవడంతో వారు ఆమె మాటలు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఆమెకు న్యాయం జరగలేదు. దీంతో ఆవేదన చెందిన మహిళ తన మామ తనపై చేసే అరాచకాలన్నీటిని వీడియోలు తీసి పోలీసులకు చూపించింది. ఆ వీడియోలను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. నిందితుడి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.