ఉట్నూర్ : మంగళవారం రోజు ఆదివాసి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదివాసి ఉద్యమకారులు వేడ్మ బొజ్జు పటేల్ కి ఉట్నూర్ మండల కేంద్రంలోని వారి నివాసంలో ఆదివాసి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పుకుని పూలబోకేతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి,ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్, ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు పేందోర్ విశ్వనాథ్, ఆదివాసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ కుంరం దశరథ్ , రైతు సేన జిల్లా కన్వీనర్ తోడషం భూమ పటేల్,ఆదివాసి సేన జిల్లా సలహాదారులు ఉయిక లక్ష్మణ్, కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు కోడప వామన్ రావు, గుడిహత్నూర్ మండల అధ్యక్షులు సేడ్మకి భీంరావ్, మండల కార్యదర్శి ఉయిక శ్యాంరావు,ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు మేస్రం సుదర్శన్, మండల కార్యదర్శి సేడ్మకి కాశీరం,కాసిపేట మండల అధ్యక్షులు మడవి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు మడవి గంగారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ పేందోర్ శంకర్, ఆదివాసి విధ్యార్థి సేన జిల్లా కన్వీనర్ కుంరం చత్రుఘన్, జిల్లా సంయుక్త కార్యదర్శి వేడ్మ చంపత్ రావు, జిల్లా సలహాదారులు ఉర్వేత గోవింద్ రావ్, జిల్లా నాయకులు కోట్నక కేశవ్, కోట్నక గోవింద్, మడవి రాము, మడవి లాల్ షావ్, సలాం జాకు, పేందోర్ రాందాస్, పేందోర్ మారుతి తదితరులు పాల్గొన్నారు.