— 150 మందికి పైగా సభ్యుల నుండి దాదాపు 45 లక్షలు వరకూ వసూలు చేసిన వైనం
— ఎస్ఐ రాజారామ్ జోక్యం తో విడిచిన వైనం
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి:
ముద్ర బ్యాంకు సిబ్బందిని గదిలో నిర్బంధించి సంఘటన ఆదివారం నల్లబెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నల్లబెల్లి శాఖలో 150 మంది సభ్యులను చేర్చుకొని రోజువారీ నెలవారి పద్ధతిలో డబ్బులు కట్టించుకుంటారు. దాదాపు సంవత్సరంన్నరగా వ్యాపారం చేస్తూ బాధితుల నుండి రూ.45 లక్షలు వసూలు చేశారు. మా డబ్బులు ఇవ్వండి అని అడిగితే బ్యాంకులో డిపాజిట్ చేశామని చెప్పడంతో ఉద్యోగులను గదిలో నిర్బంధించారు. మంగళవారం సిబ్బంది వచ్చి సమస్య పరిష్కరిస్తరని స్థానిక ఎస్సై రాజారాం హామీ ఇవ్వడంతో సిబ్బందిని వదిలేశారు.