Tuesday, April 15, 2025
Homeక్రైం న్యూస్క్రైమ్ న్యూస్మైనర్‌ కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష!

మైనర్‌ కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష!

(కేరళ): మైనర్‌ బాలికపై సొంత తండ్రే దారుణానికి ఒడిగట్టిన ఉదంతమిది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. అలాంటి కీచక తండ్రికి (42) కేరళ కోర్టు పెద్ద శిక్ష విధించింది.

పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన నేరానికి గానూ 150 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ఈ మేరకు పెరింతల్మన్న ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు -2 తాజాగా తీర్పు వెలువరించింది.

మలప్పురం జిల్లాలోని కలికావు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2022లో ఈ దారుణం జరిగింది. దోషికి ముగ్గురు భార్యలు కాగా.. అందులో ఒక భార్య కుమార్తెపై ఈ కీచకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును విచారించిన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు.. పోక్సో, ఐపీసీ, జువైనల్‌ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు శిక్ష విధించింది.

16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఐపీసీ 376 (3) కింద 30 ఏళ్లు; 16 ఏళ్లలోపు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినందుకు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 4(2) కింద 30 ఏళ్లు శిక్ష విధించింది. పదే పదే చిన్నారిపై లైంగిక దాడి పాల్పడినందుకు, కుటుంబసభ్యుడే అత్యాచారానికి పాల్పడిన నేరానికి పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 40+40 ఏళ్లు చొప్పున శిక్ష వేసింది. జువైనల్‌ యాక్ట్‌ కింద గృహంలోకి అక్రమంగా చొరబడినందుకు 7 ఏళ్లు, చిన్నారిపై క్రూరంగా వ్యవహరించినందుకు మూడేళ్లు కలిపి 10 ఏళ్లు శిక్ష విధించింది. మరో నాలుగు లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ.2 లక్షలు బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు సూచించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది. దీంతో శిక్షల్లో గరిష్ఠ శిక్ష అయిన 40 ఏళ్ల జైలు అతడికి వర్తిస్తుందని కోర్టు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన ఆర్డర్‌ కాపీలో పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?