-రాష్ట్ర కార్యదర్శి పై దురుసుగా ప్రవర్తించిన మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలి
ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్
రిపబ్లిక్ హిందుస్థాన్, నర్సంపేట : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ అధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది… ఈ సంధర్బంగా పాల్గొన్న గజ్జల దేవేందర్ మాట్లాడుతూ… వ్యవసాయ ఉద్యాన యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించొద్దు అంటూ మరియు జీవో నె.55 వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని శాంతి యుతంగా డిమాండ్ చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు చెయ్ చేసుకోవడం,దురుసుగా ప్రవర్తించడం సిగ్గు చేటు అని మరియు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ పై మహిళా పోలీసులు నిన్న బండి పై ఈడ్చుకొని వెళ్ళడం సరి కాదు అని. ఇదేనా రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎద్దేవా చేశారు. ఈడ్చుకెళ్ళిన మహిళా పోలీసులపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరియు జీవో నెం.55 వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సాయి విశాల్,ఉమర్ ఫారుక్,ప్రశాంత్,శ్రీకాంత్,రాహుల్,ప్రణయ తదితరులు పాల్గొన్నారు….
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 55 ను వెంటనే వెనక్కి తీసుకోవాలి
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on