◾️ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సూపర్డెంట్ కు వినతి అందజేత
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కృష్ణ ను అక్రమ డిప్యూటేషన్ ద్వారా, నల్లబెల్లి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ కి పంపడన్ని ఏ బి ఎస్ ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూకొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 70 మంది ఆదివాసి గిరిజన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల పై ఆధారపడి విద్యను కొనసాగిస్తున్నారని, అలాంటి తరుణంలో కొంతమంది నాయకుల అండదండలతో అక్కడ పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు కృష్ణ అక్రమ డిప్యూటేషన్ తో మరొక పాఠశాలకు వెళ్లారని అన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు కొనసాగించడం అధికారుల అలసత్వం, నిర్లక్ష్యనికి నిదర్శనం అని అన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసి గిరిజన హరిజన విద్యార్థుల పట్ల ఎందుకింత వివక్షత అని ప్రశ్నించారు. ఇట్టి విషయంపై సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి అక్రమ డిప్యూటేషన్ రద్దుచేసి ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయ్ శరత్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.