హఠాన్మరణం తో దిక్కుతోచని స్థితిలో కుటుంబ పరిస్థితి…
రోజు వ్యవసాయ కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న యువకుడి మృతితో గ్రామంలో విషాదం ….
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా
జామిడి గ్రామంలో మంగళవారం రోజు విషాదం చోటుచేసుకుంది . గాయిక్వాడ్ ప్రవీణ్ అనే 32 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రోజు వ్యవసాయ కూలిగా పని చేస్తూ కుటుంబ భారం మోస్తున్నా ప్రవీణ్ మంగళవారం రోజు ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో మృతిచెందాడు. మృతుని కి భార్య గాయిక్వాడ్ అర్చన (27) మరియు నలుగురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు వయసు 6 సంవత్సరాలు , మిగతా ముగ్గరు చిన్నారులున్నారు. భార్య రోధిస్తున్న తీరు చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు.మృతుని పిల్లలు తమ తండ్రికి ఏమయిందో కూడా తెలియక అక్కడ వస్తున్న జనాల్ని అమాయకంగా చూస్తున్న చిత్రం ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే ప్రవీణ్ ఒక్కసారిగా హఠాన్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.